కణేకల్లు శివారు కొత్తపల్లి క్రాస్ వద్ద కణేకల్లు-రాయదుర్గం ప్రధాన రోడ్డుకు సంబంధించిన ప్రభుత్వ స్థలం స్థానిక వైసీపీ నాయకుడి బంధువుల కబ్జాకు గురైంది. వారు ఆక్రమించిన స్థలంలో షెడ్డు ఏర్పాటు చేసి, టీ కేఫ్ కు అద్దెకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఇదే తరహాలో స్థలం ఆక్రమణ జరిగిందని, వంకను పూడ్చివేయడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.