ఐరావతంపై సంగమేశ్వరుడి విహారం

మండల కేంద్రంలో జరుగుతున్న జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు. ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించి, రాత్రి స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. ఐరావత వాహనాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం మడుగుతేరు, రథోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వేదపండితులతో రుద్రాభిషేకం, హోమాలు నిర్వహిస్తారని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. సీఐ రాజు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్