గోళ్ళ గ్రామం SC కాలనీ లో వైద్య శిబిరం

కళ్యాణదుర్గం SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS Unit-2 ఆధ్వర్యంలో, PO డాక్టర్ కె. శ్రీధర్ నేతృత్వంలో గోళ్ళ గ్రామంలోని SC కాలనీలో బుధవారం 5వ రోజు వైద్య శిబిరం నిర్వహించారు. ముద్దనానిపల్లి PHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయనంద, మలేరియా ఏరియా అధికారి తిరుపాల్, వైద్య సిబ్బంది, గోళ్ళ CHO చెన్నమ్మ, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, ANM మాదవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకొని, ఉచితంగా మాత్రలు పొందారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్