రాయదుర్గంలో, ఏప్రిల్ 2న, సేవా భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జి. గంగారామ్ ఆధ్వర్యంలో YSRCP రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని సేవా దినంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేదలు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. "పుట్టినరోజు వేడుకలకు మించి పేదవాడి ఆకలి తీర్చడమే!" అని విశ్వనాథ్ రెడ్డి సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఆయన సేవా దృక్పథం యువతకు ఆదర్శమని స్థానికులు ప్రశంసించారు.