రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 6:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, 8:00 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి, మధ్యాహ్నం 12:30 గంటల వరకు విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.