అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందని అన్నారు. శాప్ డైరెక్టర్ బొమ్మినేని శివ ఆధ్వర్యంలో బుడ్డప్ప నగర్‌లోని రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో 250 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మినేని శివను ఎమ్మెల్యే దగ్గుపాటి అభినందించారు.