లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత ఐదేళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పీఎంఏవై పథకం కింద అర్హత పొందిన 657 మంది లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్