మహిళా హాస్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అనంతపురంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. నిరుపేద కమ్మ సామాజిక వర్గ మహిళల విద్యాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా చిన్నమ్మ, ఏపీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చల్లా కొండయ్య జ్ఞాపకార్థం ఈ హాస్టల్‌ను నిర్మించారు. ఎమ్మెల్యే హాస్టల్‌లో వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించి, నిర్వాహకులను, చల్లా రాజేంద్రప్రసాద్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్