ఆంధ్రప్రదేశ్ కు ఇక అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు ఆమోదం తెలపడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించిందని ఆయన తెలిపారు. ఇది చారిత్రక పరిణామమని, గత కొన్నేళ్లుగా రాజధానిపై ఉన్న సందిగ్ధత, ఆందోళనలు తొలగిపోయాయని, రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.