అనంతపురం క్యాంప్ కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఎప్పుడు, ఎలా చేపట్టాలనే అంశాలపై చర్చించారు. పనులు నాణ్యతతో, అతి త్వరగా పూర్తి చేయాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించేలా చూడాలని, నిధుల దుర్వినియోగం జరగకుండా ఆదేశించారు. సాగునీటి సంఘాలు, రైతులతో చర్చించి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు.