అనంతపురం నగరంలోని 2వ డివిజన్‌లో శుక్రవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఇటీవలి కాలంలో భర్తలను కోల్పోయిన 21 మంది మహిళలకు కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షంలో నిలిచిందని తెలిపారు.