ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి దూరదృష్టితో ప్రారంభించిన పీ-4 కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మార్గదర్శి కుటుంబాలను సత్కరించి, అభినందించారు. పేదరికంతో, ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వారికి ఈ కార్యక్రమం ఎంతో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.