అనంతపురం జేఎన్టీయూలోని కళాశాల ఆడిటోరియంలో సోమవారం పీ-4 కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఆనంద్, సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ స్వప్న, మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్ బల్లా పల్లవి కూడా పాల్గొన్నారు.