పామిడి: పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య

మంగళవారం అనంతపురం జిల్లా నీలూరు గ్రామానికి చెందిన 38 ఏళ్ల రైతు నాగేంద్ర రెడ్డి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్లుగా 13 ఎకరాల భూమిలో ఆరు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, పత్తి పంట సరిగా పండకపోవడంతో రూ.20 లక్షల అప్పులయ్యాయి. మనస్తాపంతో ఈ ఘోరానికి పాల్పడినట్లు భార్య జయసుధ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్