ఒక్క రోజులోనే 96శాతం మందికి పింఛన్లు అందించాం: ఎమ్మెల్యే

అనంతపురం నవోదయ కాలనీ, 47వ డివిజన్ రంగస్వామి నగర్, నారాయణపురం పంచాయతీలోని స్టాలిన్ నగర్ లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతూ పింఛన్లు అందజేశారు. ఉదయం 9 గంటల్లోపే 56% పింఛన్లు పూర్తి చేశామని, ఒక్క రోజులోనే 96% మందికి ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే తెలిపారు. పింఛన్ల పంపిణీపై లబ్ధిదారుల స్పందన తెలుసుకున్న ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.

సంబంధిత పోస్ట్