అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతపై పోలీసుల అవగాహన

అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా స్త్రీరక్ష పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఇంట్లో నుంచే నేరుగా జిల్లా ఎస్పీ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం పొందే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. శక్తి యాప్, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు.

సంబంధిత పోస్ట్