నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేశారని ధర్నా

కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఏప్రిల్ ఫూల్ చేసిందని ఐక్య విద్యార్థి యువజన సంఘాలు ఆరోపించాయి. అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. AISF జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్