అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 540.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా పామిడి మండలంలో 84.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెద్దవడుగూరులో 44.8, యాడికిలో 44.2, పెద్దపప్పూరులో 40.4, అనంతపురం రూరల్ లో 36.0, అనంతపురం అర్బన్ లో 30.2, కుందుర్పిలో 28.2, బ్రహ్మసముద్రంలో 27.0, కళ్యాణదుర్గంలో 21.0, కణేకల్ లో 21.0, డి. హీరేహల్ లో 16.4, శింగనమలలో 20.8, పుట్లూరులో 8.8, ఆత్మకూరులో 7.2, తాడిపత్రిలో 4.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.