అనంతపురంలో ఏప్రిల్ 11న ప్రతిభావంతులైన సోషల్ మీడియా సభ్యులకు ఆర్పీఎస్ ఆధ్వర్యంలో బహుజన బంధు పురస్కారం, సన్మానం నిర్వహిస్తామని పోతుల నాగరాజు బుధవారం తెలిపారు. ప్రధాన పత్రికలలో వివక్ష కారణంగా సోషల్ మీడియా పాత్ర పెరుగుతోందని, జర్నలిజంపై ఆసక్తితో యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్న వారికి ఈ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.