35 సం. గా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

35 సంవత్సరాలుగా చట్టాన్ని కళ్లుగప్పి తిరుగుతున్న ఒక నిందితుడిని అనంతపురం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరచగా, ఈనెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించారు. లాంగ్ పెండింగ్ కేసుల పరిష్కారం దిశగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. నిందితుడు బోయ నరసింహులు (64) కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా, పావగడ తాలూకా, తిరుమణికి చెందిన కేతగాని చెరువు గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్