కళ్యాణదుర్గంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల ర్యాలీలతో ఉద్రిక్తత నెలకొంది. MLA సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ చేపట్టగా, మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరుపార్టీల ర్యాలీలు ఎదురుపడటంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వెంటనే డీఎస్పీ రవిబాబు పోలీసు సిబ్బందితో రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.