వైసిపి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి పాలన సాగించారు

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, వైసిపి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి పాలన సాగించారని, అందుకే ప్రజలు వారిని 11 స్థానాలకు పరిమితం చేశారని విమర్శించారు. అర్బన్ టిడిపి కార్యాలయంలో జరిగిన 39వ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను ఓపికగా విన్నారు. కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. 22 నెలల కాలంలో ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించామని, ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన 957 అర్జీలను ప్రాధాన్యతలవారీగా పరిష్కరిస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.

సంబంధిత పోస్ట్