టీడీపీ మైనార్టీ నేత సైఫుద్ధీన్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే అంటున్నారని కన్నీరు పెట్టుకున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులే కారణమని వాపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీరుపై మరోసారి చర్చకు దారితీసింది.