దొంగలు బాబోయ్.. రోజుకో చోరీ

పుట్లూరు మండలంలో విద్యుత్ కేబుల్ వైర్ల చోరీలు పెరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న చింతలపల్లెలో జరిగిన సంఘటన మరువకముందే, పుట్లూరులోని వ్యవసాయ పొలాల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను దొంగిలించారు. లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పెద్దయ్యలకు చెందిన వైర్లు పోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాల వల్ల సాగు పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్