రైతుల వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ వైర్లను దొంగిలించిన కేసులో నిందితుడు చాకలి రాఘవేంద్రకు అనంతపురం జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 3 కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు, దర్యాప్తు అధికారులను అభినందించారు.