ఏ పల్లెకు వెళ్లిన కాడి. మేడి. ఇప్పటికి కనిపిస్తూనే ఉన్నాయి కొందరు వ్యవసాయ యాంత్రీకరణ పై దృష్టి పెట్టగా మరికొందరు ఇంకా పాత పద్ధతిలోనే సాగు చేస్తున్నారు, దుక్కులు దున్నే అప్పటినుంచి పంట ఇంటికి తీసుకు వచ్చేంతవరకు రైతులకు ఎద్దుల సాయం అవసరం ఉంటుంది,వ్యవసాయ పనిముట్లు కూడా స్వతహాగా చేయించుకుని వాడే విధానం నేటి గ్రామాల్లో కొనసాగుతోంది,ఈ ప్రాంతంలో మెట్ట సాగుకు పాతతరం సేద్యం తోనే సంతృప్తిగా ఉంది అంటున్నారు ,రైతులు పొద్దున్నే లేచి చద్దిమూట నెత్తిన పెట్టి. కాడి కట్టి. మేడి పట్టి పొలానికి వెళ్లడం పొద్దస్తమానం దుక్కి దున్ని సేదతీరడం రైతు దినచర్య సీజన్ బట్టి పంటలు సాగు చేసుకోవడం పంటలో కలుపు తీత. సాలు తొలి పంట దిగుబడి తో ఇంటికి చేరే వరకు ఈదుల సహకారం పూర్తిగా ఉంటుంది. సేద్యానికి అవసరమైన పనిముట్లు మడక. గొర్రు. గుంటక దంతి. ఆయా వస్తువులను వడ్రంగి ద్వారా మరియు స్వయంగా తయారుచేసుకుని సేద్యం చేస్తున్నారు, గోరంట్ల మండలం లో మెజార్టీ గ్రామాల్లో చిన్న. సన్నకారు. రైతులు ఈ పాత తరం సేద్యం చేస్తున్నారు, అలాగే యాంత్రీకరణ వస్తువులు వచ్చినప్పటికీ ఎద్దుల సేద్యానికి ఆదరణ పెరగడం తోడుగా పశుగ్రాసం కొరత కారణంగా వేసవిలో పనులు లేక వాటిని పోసిన కష్టం గా మారడం తో ఖరీఫ్ ముగిసిన వెంటనే రైతులు పశువులను విక్రయించి మళ్లీ ఖరీఫ్ ప్రారంభంలో కొనుగోలు చేయటం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా సాగుతోంది ,దుక్కు దున్నే టప్పుడు ట్రాక్టర్లు వినియోగించి విత్తనం విత్తే సమయానికి ఎద్దుల సేద్యానికి రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు.
గుంతకల్లు
గుత్తి: ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ సిడిపిఓ