ఉరవకొండ నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఇందిరానగర్, ఈశ్వరమ్మ, శివరామిరెడ్డి కాలనీలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షం కారణంగా ప్రజల దైనందిన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.