అనంతపురం పట్టణంలోని యూనేటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (USFI) జిల్లా కార్యాలయంలో సోమవారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో USFI రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమేష్ నూతన జిల్లా కార్యదర్శిగా, ఎర్రిస్వామి నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 11 మంది సభ్యులతో కూడిన నూతన జిల్లా కమిటీ, 20 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్ పిలుపునిచ్చారు.