చాగల్లు రిజర్వాయర్ నిండడంతో పెన్నా నదికి నీరు విడుదల

పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ నేపథ్యంలో తాడిపత్రి వైపు పెన్నా నదికి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు హెచ్‌ఎల్‌సి ఏఈ హరి ఆదివారం వెల్లడించారు. నది పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఐ రామసుబ్బయ్య సూచించారు. చిన్నవాళ్లు నది దగ్గర వెళ్లకూడదని కూడా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్