చిత్తూరు జిల్లా వి కోటలో జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఖండించారు. ఈ ఘటనకు కారణమైన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ప్రతి జర్నలిస్టుకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.