అభివృద్ధి చేస్తుంటే.. కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు: ఎమ్మెల్యే

అనంతపురంలో పార్టీ నేతల సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కొంతమంది పదవులు వచ్చాయని సంతృప్తి చెందుతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రజల్లో తిరగాలని, అలాంటి వారికే పార్టీ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. క్లస్టర్, డివిజన్, యూనిట్, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్