యాడికి మండల కేంద్రానికి చెందిన ఒక యువతి గత సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటరమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.