ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో ఎస్పీ సతీశ్ కుమార్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా, నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని 40 బైకులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో గొడవలకు పాల్పడే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, పదేపదే నేరాలకు పాల్పడితే ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.