ధర్మవరం మండలం పోతుకుంట గ్రామ సమీపంలోని అక్కమ్మ గార్ల ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి మల్లయ్య ఫిర్యాదు మేరకు, శ్రీశైలం వెళ్ళిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ తలుపులు పగులగొట్టి 750 గ్రాముల వెండి నగలు, 20 వేల విలువైన మైక్ సెట్‌ను దొంగిలించినట్లు తెలిపారు. రూరల్ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.