ధర్మవరం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సత్య కుమార్

గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో బుధవారం మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ, ధర్మవరం నియోజకవర్గానికి రెండేళ్లలో రూ. 9.42 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ అందించినట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ. 3 కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను రెండేళ్లలోనే అంతకు మించి ఎక్కువ మొత్తాన్ని అందించానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్