ముదిగుబ్బ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక పిల్ల మృతి

ముదిగుబ్బ సమీపంలోని 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మైక్రో టవర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక జింక పిల్ల అక్కడికక్కడే మరణించింది. మొక్కలకు నీరు పోస్తున్న సిబ్బంది ఈ ఘటనను గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్