ధర్మవరం పట్టణ ఓబిసి మోర్చా కమిటీల నియామకం

ధర్మవరం బీజేపీ కార్యాలయంలో బుధవారం ఓబీసీ మోర్చా నాయకుల సమావేశం జరిగింది. పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేష్ ప్రజాపతి ఆధ్వర్యంలో పట్టణ ఓబీసీ మోర్చా కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి కోటి సుధా హాజరై సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జింక చంద్ర, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా పార్టీలో ఓబీసీ వర్గాల బలోపేతం లక్ష్యంగా కమిటీలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్