ముదిగుబ్బ మండలం గంగిరెడ్డిపల్లిలో శుక్రవారం టీడీపీ నాయకుడు శివయ్యపై వైకాపా కార్యకర్త అక్కులప్ప మారణాయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో శివయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.