సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం నడుమిగడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిపై జరిగిన కులదూషణలు, బెదిరింపులు, దాడులను బహుజన సమాజ్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఒక యువకుడిని కులపేరుతో దూషించి, దాడి చేసి, రహదారిలో అడ్డగించి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. సాకే వినయ్ కుమార్ బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.