ధర్మవరంలోని శ్రీ దుర్గమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా మహిళా భక్తులు దుర్గమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారన్నారు. మహిళలు హిందూ సంప్రదాయంగా పట్టు వస్త్రాలు ధరించి, బోనాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.