ముదిగుబ్బలో కారు బోల్తా.. నలుగురికి గాయాలు

శనివారం రాత్రి ముదిగుబ్బ బైపాస్‌లోని కాకతీయ జంక్షన్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ధర్మవరానికి చెందిన ఒక కుటుంబం విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు డివైడర్ సరిగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని సమాచారం. కారులో ప్రయాణిస్తున్న మహిళతో సహా నలుగురు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్