ధర్మవరంలో జూలై 31, ఆగస్టు 1న జరిగే సీపీఐ జిల్లా రెండవ మహాసభలను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. పట్టణంలోని 40 వార్డుల్లో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శులు మధు, రవికుమార్‌తో పాటు అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు భారీగా ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలను సభలకు ఆహ్వానిస్తూ విజయం కోసం సహకరించాలంటూ కోరారు.