ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, వరదాపురం సూరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యేలుకుంట్ల అప్ప స్వామి నాయుడు, కె. వెంకటరమణప్ప, బొడగల గిరి, మాజీ కౌన్సిలర్ సుజాత, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.