ఎండాకాలంలో వర్షాలు, వానాకాలంలో ఎండలు వింత వాతావరణనికి చంద్రబాబు సీఎంగా ఉన్నందుకే జరుగుతున్నాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు. రైతులు పంటలు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంటలు వేస్తే నాశనమేనని అన్నారు. అయన హయాంలో ప్రతిది గిన్నీస్ రికార్డేనని విమర్శించారు. జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అయినా ఆయనను ఆపేందుకు 2 వేల మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.