ధర్మవరం: లారీ ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

ధర్మవరం పట్టణం నుంచి ఎర్రగుంట వెళ్లే రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సికేపల్లి మండలం మేడాపురానికి చెందిన కొండన్న అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్