రావులచెరువులో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తల్లికి వందనం పడిన తల్లులకు వారి బిడ్డలచే పాదాభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇష్టగొష్టి లో భాగంగా అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు, వక్తలు పిల్లలకు మొబైల్ ఇవ్వటం వల్ల కలిగే దుషపరిణామాలు, ఆడపిల్లలకు కొన్ని సలహాలు సూచనలు తెలియచేసారు.