ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామి నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి సత్య కుమార్ పాల్గొన్నాను. ఈ సందర్బంగా ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లు అందజేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ సామాజిక పెన్షన్లకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.