ధర్మవరంలోని స్త్రీ శక్తి భవన్ లో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో నిర్వహిస్తున్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి, మహిళా సాధికారత కార్యక్రమం కింద ఈ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తుండటం మంచి పరిణామం అని మంత్రి అన్నారు.