పుట్టపర్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా విస్త్రృత స్థాయి కార్యకర్తల సమావేశంలో గురువారం మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి ముఖ్యంగా ధర్మవరం నుంచి తరలి వచ్చిన బీజేపీ కార్యకర్తలందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసే కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి పీవీఎన్ మాధవ్ గారే ఉదాహరణ అని మంత్రి తెలిపారు.