రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం పట్టణంలో శుక్రవారం పాదయాత్ర చేపట్టారు. శివానగర్ శివాలయం వద్ద నుంచి ప్రారంభమైన యాత్రలో జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ది చెందుతుంది అన్నారు.